రానా దగ్గుబాటి టాప్ ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు

1.    బాహుబలి చిత్రాలు
బాహుబలి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఆ మాటకు వస్తే అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు.రానా అనే పేరు కంటే కూడా భల్లాలదేవ అని పిలిచేవాళ్లే ఎక్కువయ్యారు. అసలు పేరు పక్కన పెట్టి భల్లాలదేవ పేరుతోనే జనం పిలవడానికి ఇష్టపడుకతున్నారంటే ఆ పాత్రను రానా ఎంత అద్భుతంగా పండించాడో అర్థంచేసుకోవచ్చు. భల్లాలదేవ పాత్రకు రానా తప్పితే మరొకరు న్యాయం చేయలేరని నమ్మిన ఎస్.ఎస్. రాజమౌళి నమ్మకాన్ని నూటికి నూరిపాళ్లు నిజం చేసాడు రానా. కెరీర్ ప్రారంభంలోనే ఒకే ప్రాజెక్ట్ కోసం ఐదేళ్ల సమయం కేటాయించడం, అందులోనూ ప్రతినాయకుడి పాత్రకు జై కొట్టడం, రానా ఎంతటి సాహసవంతుడైనా నటుడో చెప్పకనే చెప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి రెండు చిత్రాలు రెండు వేల కోట్లకుపైగా కొల్లగొట్టాయి. భారతీయ సినిమా గతిని మార్చిన చిత్రాలుగా నిలబడ్డాయి. అటు వంటి చిత్రంలో రానా కనిపించాడు. భల్లాలదేవుడి పాత్రతో జనం గుండెల్లో నిలిచిపోయాడు. అందుకే బాహుబలి చిత్రాలు రానా కెరీర్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి.

2.    లీడర్ 
ఏ చిత్రంతో అయితే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడో .. ఆ చిత్రమే కెరీర్స్ బెస్ట్ మూవీస్ లిస్ట్ లో నిలవడం అంటే చిన్న విషయం కాదు. డెబ్యూతోనే 50 చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న నటుడిగా పేరు ప్రఖ్యాతలు అందుకోవడం అందరి వల్లా కాదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏవీఎమ్ ప్రొడక్షన్స్ లాంటి ప్రఖ్యాత బ్యానర్ తో వెండితెరకు పరిచయం కావడం గొప్ప వరం. అది రానా చేసుకున్న అదృష్టం. అయితే ప్రేమకథలు, లేదా యాక్షన్ చిత్రాలతో సినీ రంగ ప్రవేశం చేసే కథనాయకుల శైలికి పూర్తి భిన్నంగా పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. అత్యంత క్లిష్టమైన అర్జున్ ప్రసాద్ పాత్రను అలవోకగా నటించి మెప్పించాడు.

3.    ఘాజీ
ఘాజీ అంటే రానా..రానా అంటే ఘాజీ... ఇండియా వైడ్ గా ఘాజీ చిత్రం గురించి చర్చ కొనసాగేలా చేసాడు.భల్లాలదేవుడి పాత్రలో భారీ దేహ ధారుడ్యంతో కనిపించి అంతలోనే ఘాజీ కోసం భరువు తగ్గించుకుని కనిపించి ఆశ్చర్యపరిచాడు దగ్గుబాటి హీరో . ఓ కొత్త దర్శకుడి దగ్గర ఉన్న చిన్న లైన్ ను పూర్తి సినిమా కథగా మార్చేందుకు ఎనలేని కృషి చేసాడు. కమర్షియాల్టీకి దూరంగా ఉన్నసినిమా చేయాడానికి ముందుకొచ్చాడు. అంతకు ముందు భారత దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని చేసాడు. సబ్ మెరైన్ లో మాత్రమే సాగే కథను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందు ఉంచాడు. లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో జీవించాడు.
ఘాజీ కథను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా మార్చడానికి .. రానా అనేక వర్షన్స్ రాయించాడు. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో కలసి 7 నెలలపాటు కథపై కూర్చున్నాడు. దాదాపు 10 వర్షన్స్ వరకు రాయించాడు. ఘాజీ లాంటి కథకు బాలీవుడ్ బడా దర్శకుడి అండ లభించాలని కోరుకున్నాడు. అందుకే బాలీవుడ్ లో ప్రమోట్ చేసిన కరణ్ జోహర్ కి సినిమా గురించి చెప్పాడు. వాళ్లు బాలీవుడ్ రైట్స్ దక్కించుకునేందుకు తనవంతుగా చాలా ప్రయత్నాలు చేసాడు.

4.    నేనే రాజు నేనే మంత్రి 
లీడర్ లాంటి పొలిటికల్ చిత్రంతోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్డాడు రానా.
అందుకే నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో మరింత రాటుదేలిన నటుడిగా కనిపించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ చిత్రంతో రానా కొత్తగా కనిపించాడు. అతడి నటనలో మరింత పరిణితి కనిపించింది.జోగేంద్ర పాత్రలో జీవించాడు. దశాబ్ధ కాలం పాటు హిట్ లేని దర్శకుడు తేజ. ఆయన చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయ్యి,...కథపై నమ్మకంతో నేనే రాజు నేనే మంత్రి చేసాడు రానా. పాత్ర కోసం తనని తాను మలుచుకున్న విధానం, చెప్పిన డైలాగులు రానాను ఓ కొత్త మాస్ హీరోగా నిలబెట్టాయి. రెండు పెద్ద చిత్రాలతో విడుదలైన నేనే రాజు నేనే మంత్రి కేవలం రానా ప్రమోషన్ స్ట్రాటజీతో సినిమా గొప్ప ప్రారంభ వసూళ్లను అందుకుంది. ఆ తర్వాత సినిమాలో కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

5.    కృష్ణం వందే జగద్గురుమ్ 

ఇల్లీగల్ మైనింగ్ పై రానా సంధించిన అస్త్రం కృష్ణం వందే జగద్గురుమ్. దర్శకుడు క్రిష్ చేసిన సాహసం. అందుకే ఈ చిత్రానికి జనం నీరాజనం పలికారు. తెలుగు భాషపై పూర్తి పట్టున్న నటుడు మాత్రమే ఇలాంటి పాత్రలు చేయగలడు. బీటెక్ బాబు పాత్రలో రానా నటన సహజత్వానికి దగ్గరగా నిలిచింది. కళ అంటే జాతిని జాగృతం చేసేది అని నమ్మి అదే పాయింట్ క్రిష్ తెరకెక్కించిన చిత్రం ఇది.

Liveinstyle

Interested in more such stories? Subscribe to LiveInStyle.com

  •