రాజమౌళి, రానా స్నేహం - నెం.1 యారీ కార్యక్రమం

కొన్ని చిత్రాలు గొప్పగా నిలుస్తాయి.

మరికొన్ని సినిమాలు చరిత్ర  సృష్టిస్తాయి.

ఇంకొన్ని పరిశ్రమకు గొప్ప స్నేహితులను అందిస్తాయి.

అలాంటి కోణంలోనే కనిపిస్తారు రాజమౌళి...రానా..

భారతీయ చిత్రం అంటే బాలీవుడ్ మాత్రమే కాదనీ నిరూపించాడు రాజమౌళి. బాహుబలిలోని ప్రతి పాత్ర ఈ రోజు జనాల్లోకి వెళ్లిపోయింది అంటే ఆయా పాత్రలకు నటీనటులు ఎంతగా ప్రాణం పోసారో అర్ధం చేసుకోవచ్చు.
రాజమౌళి సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా అపజయం అనేది లేకుండా చిత్రాలు తెరకెక్కిస్తూ వచ్చాడు. ప్రతి చిత్రంలోనూ హీరోయిజమ్ ను గొప్పగా ఎలివేట్ చేస్తాడు. హీరోయిజమ్ కంటే వంద రెట్లు విలనిజం ఒళ్లు గగుర్పొరిచే విధంగా ఉండాలనుకుంటాడు.అది ఆయన విజయసూత్రం కూడా. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రం తీయాలనుకున్నప్పుడు హీరో కంటే విలన్ ఎంపికే రాజమౌళిని ఎక్కుగా కలవరానికి గురి చేసింది. ఎందుకంటే ఆ పాత్రకు రానా తప్పితే మరొకరు న్యాయం చేయలేరని రాజమౌళి నమ్మకం. అందులోనూ బాహుబలి చిత్రాలు ఆరో నెలలు, లేదా సంవత్సరం పాటు షూటింగ్ తో ముగిసిపోయేది కాదు. కొన్నేళ్ల శ్రమ. నాలుగేళ్లు పట్టచ్చు. ఐదేళ్లు కూడా దాటచ్చు. 

రాజమౌళి బాహుబలి కథతో రానా దగ్గరికి వెళ్లినప్పుడు.. రానా చాలా ఎగ్జైట్ అయ్యాడు. కానీ కెరీర్ బిగినింగ్ లో ప్రతినాయకుడిగా నటించేందుకు ఒకింత సందేహించాడు. కానీ కథ చెప్పిన కొన్ని గంటల్లోనే  రానా రాజమౌళి చిత్రం చేస్తున్నట్లు చెప్పాడు. అప్పుడే మొదలైంది రాజమౌళి , రానా అనుబంధం.
కాలం అనేది కరిగేపోయే క్షణాలతో సమకూరిందైతే.. బాహుబలి కలకాలం నిలిచే శిల్పం అన్నాడు దగ్గుబాటి రానా. రాజమౌళి సినిమాను అంతగా నమ్మాడు కాబట్టే.. ప్రతినాయకుడి పాత్రకోసం ఏకంగా నాలుగేళ్లు మించి సమయాన్ని కేటయించాడు.రాజమౌళి చేస్తున్న సాహసానికి అండగా నిలిచాడు. అది రానా చూపించిన స్నేహ భందం అని చెప్పుకోవచ్చు.

ఒక్కసారి రాజమౌళితో ప్రయాణం మొదలైన తర్వాత..దర్శకుడు ఎలా చెబిదే అలా నడుచుకున్నాడు రానా. పాత్రకు తగ్గట్లు తనను తాను మలుచుకున్నాడు. తెలుగు భాషపై అద్భుతమైన పట్టు ఉండటం రానాలో ప్లస్ అంటాడు రాజమౌళి. ఒక దర్శకుడిగా కాకుండా ఒక మంచి మిత్రుడిలా రాజమౌళి, రానా ని వెంనేంటే ఉండి చూసుకున్నాడు. 
రానా, రాజమౌళి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి మరో ఉదాహరణ కూడా ఉంది. బాహుబలి చిత్రాన్ని తన సొంత చిత్రంగా భావించి రాజమౌళి చేస్తున్న అద్భుతాన్ని బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది రానానే. కరణ్ జోహర్ తో తనకున్న పరిచయంతో బాహుబలిని బాలీవుడ్ కి తీసుకెళ్లాడు రానా.

బాహుబలి చిత్రాల ప్రయాణం నాలుగేళ్ల పాటు సాగింది. ఈ దశలో మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య లభించిన కొద్ది పాటి సమయంలో మరో చిత్రం చేయాలనుకున్నాడు రానా. ఆ సినిమానే ఘాజీ. సబ్ మెరైన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చేయాలని రానా ఎంతో ఆశ పడ్డాడు. కానీ రానా చేస్తున్న ప్రయత్నాన్ని మొదట చాలా మంది నిరుత్సాహపరిచారు. రాజమౌళి ఒక్కడే ఘాజీ చిత్రం చేయమని రానాను ప్రొత్సాహించాడు. అది రాజమౌళికి రానా మీద ఉన్న నమ్మకం.
నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ కోసం రాజమౌళి తనవంతుగా ముందుకొచ్చాడు. సినిమా ప్రమోషన్ లోనూ చురుగ్గా  పాల్గొన్నాడు.
అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో చిత్ర యూనిట్ కొనసాగించిన కొత్త తరహా ప్రమోషన్ కి రాజమౌళి ఫిదా అయ్యాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని చూసి గొప్పగా నటించాడు మా భల్లాలదేవుడు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసి తన స్నేహాన్ని చాటి చెప్పాడు.

సినిమా తప్ప మరో ధ్యాస లేకుండా కనిపిస్తాడు రానా. అందుకే బాహుబలి చిత్రాలతో మొదలైన రానా, రాజమౌళి స్నేహ బంధం ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళుతోంది. దగ్గుబాటి హీరో చేస్తున్న ప్రతి ప్రయతాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు రాజమౌళి. అది సినిమా అయినా.. బుల్లితెర అయినా ఒకటే అన్నట్లు ఉంది. రానా చేస్తున్న రియాలిటీషో నెం.1 యారీ మొదటి ఎపిసోడ్ మొదలైంది రాజమౌళి తోనే. ఆయన ఇంటర్వూతోనే తన బుల్లితెర ప్రయాణాన్ని మొదలుపెట్టాడు రానా. నెం.1 యారీ కార్యక్రమం రాజమౌళి, రానా మధ్య  ఉన్న గొప్ప స్నేహాన్ని ప్రేక్షకుల ముందు ఉంచింది. ఛలోక్తులు, చురకలు వేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు ఇద్దరు. రానా రాజమౌళి ని షో లో రాపిడ్ ఫైర్ ప్రశ్నలతో అలరించారు. రాజమౌళి విలువిద్యా ప్రదర్శనలో అన్ని బాణాలు గురితప్పకుండ కొట్టడం అందరిని ఆశర్యపరిచింది. మొతానికి ఈ షో ద్వారా రాజమౌళి, రానా స్నేహం మరింత బయటపడింది అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ మొత్తం దగ్గుబాటి హీరోని రానా అంటూ పిలిస్తే.. ఒక్క రాజమౌళి మాత్రం మా భల్లల అంటూ గొప్పగా చెప్పుకొస్తాడు.   

పూర్తి ఎపిసోడ్  కొరకు ఇక్కడ చూడండి 

Liveinstyle

Interested in more such stories? Subscribe to LiveInStyle.com

  •