కరణ్ జోహర్ కి అత్యంత ఆప్తుడు రానా

కరణ్ జోహర్ కి అత్యంత ఆప్తుడు రానా

2010 లో లీడర్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు దగ్గుబాటి రానా. ఆ తర్వాత ఏడాది అంటే 2011లోనే.. బాలీవుడ్ లో దమ్ మారో దమ్ మూవీతో ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అందుకే రానా ఉంటే హైదరాబాద్ లో ఉంటాడు లేదా ముంబైలో కనిపిస్తాడు. మరో విధంగా చెప్పాలంటే రానాకు హైదరాబాద్ కంటే ముంబైలోనే స్నేహితుల సంఖ్య ఎక్కువ. అలాంటి స్నేహితుల్లో ఒకడు ప్రఖ్యాత నిర్మాత, దిగ్గజ దర్శకుడు కరణ్ జోహర్. బాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ దర్శకుడు , రానాకు మంచి స్నేహితుడు. ఆ స్నేహం తోనే 2013లో కరణ్ జోహర్ బ్యానర్ పై తెరకెక్కిన యే జవానీ హై దీవానీ చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు రానా. కరణ్ జోహర్ బ్యానర్ లో హీరోగా ఒక్క చిత్రం చేయకపోయినా .. సినిమా పై రానాకు ఉన్న ప్యాషన్ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. బాహుబలి చిత్రాలను బాలీవుడ్ లో విడుదలయ్యేలై ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకున్నాయి అంటే అందుకు కారణం రానా, కరణ్ జోహర్ స్నేహమే. బాహుబలి లాంటి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ దక్షిణాదిలో తెరకెక్కుతుందనీ, తెలుగు సినిమా గతిని మార్చబోతుందనీ ఊహించి . .అదే విషయాన్ని కరణ్ జోహర్ కి ఫోన్ చేసి చెప్పాడు రానా. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్  ఆయనకు చూపించాడు. అప్పటికే ఈగ చిత్రంతో రాజమౌళి పనితనం చూసిన  కరణ్ జోహర్... మరో ఆలోచన లేకుండా బాహుబలి బాలీవుడ్ రైట్స్ దక్కించుకున్నాడు. మొన్న విడుదలైన బాహుబలి -2  వరకు ఆ జర్నీ కొనసాగుతూనే ఉంది. 

కరణ్ జోహర్ కి అత్యంత ఆప్తుడు రానా

రానా నటించిన ఘాజీ చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో విడుదల చేసాడు కరణ్ జోహర్. కరణ్ జోహర్ బ్యానర్ పేరు ధర్మ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ నుంచి కొత్త సినిమా విడుదలవుతోంది అంటే ఉత్తరాది ప్రేక్షకులు హీరో ఎవరనేది పక్కన పెట్టి టికెట్స్ ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు. కరణ్ జోహర్ చిత్రాలపై వారికంత నమ్మకం. అలాంటి బ్యానర్ లో రానా నటించిన చిత్రాలు విడుదల కావడం అంటే చిన్న విషయం కాదు. సినిమా పై రానా మక్కువను కరణ్ జోహర్ గౌరవిస్తాడు. అందుకే రానా చేస్తున్న ప్రతి ప్రయత్నానికి తాను అండగా నిలుస్తున్నాడు. బాహుబలి 2 సంచలన విజయం సాధించిన తర్వాత కరణ్ జోహర్ ఓ కింగ్ సైజ్ పార్టీని అరేంజ్ చేసాడు. ఆ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ప్రభాస్ , రానా. ఇప్పటికిప్పుడు కాకపోయినా... సమీప భవిష్యత్ లో కరణ్ జోహర్ బ్యానర్ లో రానా స్ట్రెయిట్ గా  ఓ హిందీ సినిమా చేసే అవకాశం లేకపోలేదు.

కరణ్ జోహర్ కి అత్యంత ఆప్తుడు రానా

కరణ్ జోహర్ కి అత్యంత ఆప్తుడు రానా

కరణ్ జోహర్ కి అత్యంత ఆప్తుడు రానా
Liveinstyle

Interested in more such stories? Subscribe to LiveInStyle.com

  •